ఆవిరి పట్టడం కాస్త రిలీఫ్ ఇచ్చేదే అయినా, ఆవిరి ఎంత సేపు పట్టాలి? ఎలా పట్టాలి? అని తెలుసుకోకుంటే మాత్రం చిన్న చిన్న చికాకులు తప్పవనినిపుణులు చెబుతున్నారు. ఆవిరి ఎన్ని నిమిషాలు పట్టాలి.. ఎలా పట్టాలి..ఆవిరి పట్టేడప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. .!
ఆవిరి పట్టేడప్పుడు ముఖం ఆవిరికి దగ్గరగా ఉండకూదదు. ఫేస్ కు వేడి తగలకూడ దు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి... లేదంటే చర్మం డల్ అవటానికి ఆవిరి పట్టడం కూడా కారణం అవుతుంది.
ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకే విధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీనివల్ల చర్మంలోని స్వేద రంధ్రాలు తెరుచుకొని, నేచురల్ గా మన స్కిన్ లో నూనె స్రవించే గ్రంథులు పొడిబారతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి అవకాశం ఉంది.
ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్ తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల స్వేదరంధ్రాలలో ఉన్న మలినాలు తొలగి పోతాయి. పొడిగా ఉన్న మెత్తని టవల్ తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరి పట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మా యిశ్చరైజర్ వాడాలి.
