డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుక ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో, పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం (జూన్ 19) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయ ముహూర్తపు కార్యక్రమంలో భాగంగా తొలి షాట్‌కు దర్శకత్వం వహించేందుకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా, దిల్ రాజు, సురేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే, ఈ వేడుకలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు ముహూర్తపు షాట్‌కు దర్శకత్వం వహిస్తున్న సమయంలో కీర్తి సురేష్, కృతి శెట్టిలను చేతులు పట్టుకుని దగ్గరకు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌పై కొందరు నెటిజన్లు ఆయన ప్రవర్తనను విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ముహూర్తపు షాట్‌కు దర్శకత్వం వహించే క్రమంలో నటీనటులను గైడ్ చేశారని సమర్థిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Raghavendra Rao garu, what exactly is this behaviour?
— Telugu Vibe (@Urs_TeluguVibe) June 18, 2026
This isn't the first time such visuals have gone viral. After the backlash over the Niharika video, one would expect that you had learned how to behave, Yet here we are again, having the same conversation.#VenkyAnil5 pic.twitter.com/lBBCA3elWg
ఈ క్రమంలోనే నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘అవసరం లేకుండా హీరోయిన్లను ఎందుకు తాకుతున్నారు?’’, ‘‘అదే విషయాన్ని చేతులు వేయకుండా కూడా చెప్పొచ్చు కదా?’’ అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా, ‘‘మహిళల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు ఎవరు ఇచ్చారు?’’ అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Entraa Behaviour idhi...?👀 #KeerthySuresh #VenkyAnil5 pic.twitter.com/icGwMugYxF
— OTT STREAM UPDATES (@newottupdates) June 18, 2026
ఇంకొందరు గతంలో నిహారిక కొణిదెలకు సంబంధించిన వివాదాస్పద వీడియోను గుర్తు చేస్తూ, ‘‘ఆ ఘటన తర్వాత అయినా మారతారని అనుకున్నాం. కానీ మళ్లీ అదే చర్చ జరుగుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, గతంలో హీరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి వైరల్ అవుతున్నాయి. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, రాఘవేంద్రరావు ప్రత్యేక చిత్రీకరణ శైలిని ఉద్దేశిస్తూ.. ‘‘కొబ్బరికాయ వచ్చి నా నడుముకు తగలడంలో ఏమి సెక్సీగా ఉందో ఇప్పటికీ అర్థం కాలేదు’’ అని చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ తాజా వివాదంపై చిత్ర బృందం గానీ, కె. రాఘవేంద్రరావు గానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై వారు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.
Nothing gives me greater joy than entertaining audiences in theatres. ❤️
— Anil Ravipudi (@AnilRavipudi) June 18, 2026
With immense happiness, gratitude, and a sense of responsibility, we begin the journey of #VenkyAnil5 - #NKRAR2 today. ❤️🔥
Heartfelt thanks to all our honourable guests for gracing the ceremony and making… pic.twitter.com/UwECcVGUYC
