- యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదాద్రి, వెలుగు : ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ పంట వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను రైతులకు వివరించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం ఉద్యాన శాఖ పథకాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలపై రివ్యూ నిర్వహించారు.
నాలుగో ఏట నుంచి వరుసగా 30 ఏండ్ల వరకూ ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల ఇన్కమ్ వస్తుందని తెలిపారు. రివ్యూ మీటింగ్లో జిల్లా ఉద్యాన అధికారి కె. హేమలత, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.
