మండలానికో స్కూల్ మోడల్ గా మార్చాలి..ప్రత్యేక ప్రణాళికత సమగ్ర రూపాంతరం

మండలానికో స్కూల్ మోడల్ గా మార్చాలి..ప్రత్యేక ప్రణాళికత సమగ్ర రూపాంతరం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి మోడల్ స్కూల్స్‌‌‌‌గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో సమగ్ర రూపాంతరం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ లో ఆయన మాట్లాడారు. 

ప్రతి మండలం నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసి, తొలి దశలో మౌలిక వసతులు, డిజిటల్ ల్యాబ్‌‌‌‌లతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, దాతలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

 అనంతరం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన డిజాస్టర్ మేనేజ్​మెంట్ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.