కొండగట్టులో సందడి చేసిన హీరో అర్జున్: కుటుంబంతో కలిసి అంజన్న దర్శనం!

 కొండగట్టులో సందడి చేసిన హీరో అర్జున్:  కుటుంబంతో కలిసి అంజన్న దర్శనం!

ప్రముఖ సినీ హీరో అర్జున్ సర్జా తన కుటుంబంతో కలిసి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు (February 16)న దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు దేవాలయానికి చేరుకున్న అర్జున్, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోతులకు అర్జున్ స్వయంగా అరటిపండ్లను అందించి భక్తిని చాటుకున్నారు. అయితే తన కూతురు  ఐశ్వర్య సర్జా నటించిన 'సీతాపయణం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన జగిత్యాలకు వచ్చారు. పూజల తరువాత జగిత్యాలలోని శ్రీనివాస థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను, అభిమానులను కలిశారు. ఐశ్వర్య సర్జా నటించిన 'సీతాపయణం' ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల అయ్యింది.