BCCI 2023-24 revenue: 60 శాతం ఐపీఎల్ నుంచే.. బీసీసీఐ 2023-24 సంపాదన రూ.1000 కోట్లు

BCCI 2023-24 revenue: 60 శాతం ఐపీఎల్ నుంచే.. బీసీసీఐ 2023-24 సంపాదన రూ.1000 కోట్లు

ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో మరోసారి నిరూపించబడింది. ఎంటర్ టైన్ మెంట్ ద్వారానే కాకుండా బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. 2023-2024 సంవత్సరానికి గాను దాదాపు రూ. 1000 కోట్లు సంపాదించింది. రిపోర్ట్స్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. 

ఎప్పటిలాగే దేశంలో ప్రధాన లీగ్ అయినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొత్తం ఆదాయంలో 59 శాతంతో ప్రధాన వాటాదారుగా నిలిచింది. కేవలం ఐపీఎల్ నుంచే రూ.5,761 కోట్లు ఆర్జించగా.. ఐపీఎల్ యేతర మీడియా హక్కుల ద్వారా బోర్డు అదనంగా రూ.361 కోట్లు సంపాదించింది. 2007 నుంచి ఐపీఎల్ బీసీసీఐకి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. రంజీ ట్రోఫీతో సహా వివిధ స్థాయిల క్రికెట్ ఆటగాళ్లకు అవకాశాలను అందిస్తోంది. ఐపీఎల్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే అది బీసీసీఐకి భారీ నష్టంగా మారే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.  

" ఐపీఎల్ కాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, సికె నాయుడు ట్రోఫీ వంటి డొమెస్టిక్ టోర్నీల ద్వారా ఆదాయాలను బీసీసీఐ సంపాదిస్తుంది. బోర్డు దగ్గర దాదాపు రూ. 30,000 కోట్ల రిజర్వ్ లో ఉన్నాయి. దీని వల్ల సంవత్సరానికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తుంది. ఈ ఆదాయాలు స్థిరమైనవి కావు. స్పాన్సర్‌షిప్‌లు, మీడియా ఒప్పందాలు, మ్యాచ్‌డే ఆదాయాల కారణంగా అవి ఏటా 10–12 శాతం పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి" అని రీడిఫ్యూజన్ చీఫ్ సందీప్ గోయల్ అన్నారు.