
ఇంగ్లాండ్ లో మరో క్రికెట్ సమరం అభిమానులని అలరించనుంది. గత ఏడాది అత్యంత విజయవంతమైన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండవ ఎడిషన్ శుక్రవారం (జూలై 18) ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ తో ఈ మెగా లీగ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్, నార్తాంప్టన్, లీడ్స్, లీసెస్టర్‌లోని నాలుగు వేదికలలో దిగ్గజాల టోర్నీ జరగబోతుంది. టోర్నమెంట్‌లోని మొత్తం 18 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఛాంపియన్స్ ఈ టోర్నీలో ఆడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇండియా బరిలోకి దిగుతుంది. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ , బ్రెట్ లీ, షాన్ మార్ష్ , క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో , ఎబి డివిలియర్స్, ఇయాన్ మోర్గాన్ , కీరన్ పొలార్డ్, ఇమ్రాన్ తాహిర్ , శిఖర్ ధావన్ , హర్భజన్ సింగ్, అలస్టైర్ కుక్, మోయిన్ అలీ వంటి దిగ్గజాలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. దిగ్గజాల ఆట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు.
Also Read:-పంత్‌కు రెస్ట్ ఇస్తున్నాం.. నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కోచ్
రౌండ్-రాబిన్ దశలో ఆరు జట్లు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ లో తలబడతాయి. పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్‌లో విజయం సాధించిన జట్లు టైటిల్ కోసం పోరాడుతాయి. పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు మొహమ్మద్ హఫీజ్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మిగిలిన ఐదు జట్లకు గత ఎడిషన్ కెప్టెన్లు కొనసాగనున్నారు. ఆదివారం (జూలై 20) ఎడ్జ్‌బాస్టన్‌లో ఇండియా, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 ను లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD ఛానెల్‌లలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నమెంట్‌లోని మొత్తం 18 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్ లు ఉంటే తొలి మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి.
WCL 2025: మ్యాచ్‌లు మరియు మ్యాచ్ సమయాలు:
జూలై 18 (శుక్రవారం): ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 19 (శనివారం): వెస్టిండీస్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ - సాయంత్రం 5 గంటలకు
జూలై 19 (శనివారం): ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 20 (ఆదివారం): ఇండియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 22 (మంగళవారం): ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ - సాయంత్రం 5 గంటలు
జూలై 22 (మంగళవారం): ఇండియా ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 24 (గురువారం): దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 25 (శుక్రవారం): పాకిస్తాన్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 26 (శనివారం): ఇండియా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ - సాయంత్రం 5 గంటలు
జూలై 26 (శనివారం): పాకిస్తాన్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 27 (ఆదివారం): దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – సాయంత్రం 5 గంటలు
జూలై 27 (ఆదివారం): ఇండియా ఛాంపియన్స్ vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ - సాయంత్రం 5 గంటలు
జూలై 29 (మంగళవారం): ఇండియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ - రాత్రి 9 గంటలకు
జూలై 31 (గురువారం): 1వ సెమీఫైనల్ - సాయంత్రం 5 గంటలకు
జూలై 31 (గురువారం): 2వ సెమీఫైనల్ - రాత్రి 9 గంటలకు
ఆగస్టు 2 (శనివారం): ఫైనల్ – రాత్రి 9 గంటలకు