IND vs ENG 2025: పంత్‌కు రెస్ట్ ఇస్తున్నాం.. నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కోచ్

IND vs ENG 2025: పంత్‌కు రెస్ట్ ఇస్తున్నాం.. నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కోచ్

ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ టీమిండియాకు చాలా కీలకం. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-2 తో వెనకబడిన టీమిండియా నాలుగో టెస్టులో విజయం సాధించడం తప్పనిసరి. ఒకవేళ ఈ మ్యాచ్ లో గిల్ సేన ఓడిపోతే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 1-3 తేడాతో సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ ప్లేయర్ల గాయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో ఒకరు బుమ్రా అయితే.. మరొకరు వికెట్ కీపర్ రిషబ్ పంత్. బుమ్రా నాలుగో టెస్ట్ ఆడడం దాదాపుగా ఖాయమైనట్టు సమాచారం.      

రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ ఆడతాడా లేదా అనే విషయంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ క్లారిటీ ఇచ్చాడు.  మాంచెస్టర్ టెస్ట్ కు ముందు టెన్ డోస్చేట్ మాట్లాడుతూ.. "పంత్ మాంచెస్టర్ లో బ్యాటింగ్ చేస్తాడు. మూడవ టెస్ట్ లో అతను చాలా నొప్పితో బ్యాటింగ్ చేసాడు.  వికెట్ కీపింగ్ అనేది అతను జట్టులో కొనసాగగలడని నిర్ధారించుకోవడానికి చివరి దశ. పంత్ కు మ్యాచ్ మధ్యలో గాయమైతే  స్థానంలో  ఇన్నింగ్స్ మధ్యలో కీపర్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇలా మేము చేయాలనుకోవడం లేదు. అతను కీపింగ్ చేయకుండా రెస్ట్ ఇస్తున్నాం. ఈ రెస్ట్ పంత్ కోలుకోవడానికి ఉపయోగపడుతుంది". అని డోస్చేట్ అన్నాడు.

ALSO READ : IND vs ENG 2025: నా జెర్సీ మీద పడ్డావేంటి గురు.. మరోసారి కోహ్లీ 18 నెంబర్ ధరించిన వైభవ్

 

అసలేం జరిగిందంటే..?
 
లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ రిషబ్ పంత్ చేతి వేలి గాయం కారణంగా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. తొలి రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుమ్రా వేసిన 34 ఓవర్ రెండో డెలివరీ పంత్ చేతి ఎడమ చేతి వేలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడడంతో ఫిజియో వచ్చి స్ప్రేను తన చేతి వేలికి చల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో పంత్ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. ఇంగ్లాండ్ స్కోర్ 93 పరుగుల వద్ద పంత్ గ్రౌండ్ వీడి వెళ్ళాడు. ఈ మ్యాచ్ లో పంత్ తన కీపింగ్ తో ఆకట్టుకున్నాడు. రెండు అద్భుతమైన  క్యాచ్ లు పట్టడమే కాకుండా అసాధారమైన విన్యాసాలు చేశాడు.