KKR Captain: రింకు సింగ్కి షాక్.. కేకేఆర్ కెప్టెన్ అతడే.. 

KKR Captain: రింకు సింగ్కి షాక్.. కేకేఆర్ కెప్టెన్ అతడే.. 

KKR Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సమీపిస్తున్న వేళ అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ తమ కెప్టెన్‌పై కీలక ప్రకటన చేసింది. రాబోయే సీజన్‌లో కూడా అజింక్య రహానేనే జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు ఈరోజు ( మార్చి 17న) అధికారికంగా ప్రకటించింది. దీంతో స్టార్ బ్యాటర్ రింకు సింగ్ కి సారథ్య బాధ్యతలు వస్తానే ప్రచారానికి తెర పడింది. 

గత సీజన్‌లో కూడా రహానే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే అతని నాయకత్వంలో జట్టు ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయింది. 2024లో టైటిల్ గెలిచిన కేకేఆర్, 2025లో మాత్రం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హతను సాధించలేక ఇంటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ రహానే వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చూపించి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

►ALSO READ | Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ డ్యాన్స్ సూపర్.. నన్ను పార్టీకి పిలవకపోయినా వెళ్లాను..   

అయితే ఈసారి కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసినప్పటికీ, కెప్టెన్సీ విషయంలో మాత్రం కేకేఆర్ యాజమాన్యం అజింక్యా రహానేపై నమ్మకం ఉంచింది. ఇప్పటికే రహానే తన LinkedIn ఖాతా ద్వారా కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు సంకేతాలు ఇవ్వగా.. తాజాగా ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసి, అజింక్య రహానేనే ఐపీఎల్ 2026లో కూడా కేకేఆర్ కెప్టెన్‌గా కొనసాగుతాడని అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాబోయే సీజన్‌లో కేకేఆర్ ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.