Rahul Dravid: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తన క్రికెట్ కెరీర్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా చేసుకునే పార్టీల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శ్రీశాంత్ మాట్లాడుతూ.. తమ కాలంలో మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ప్లేయర్స్ ఎక్కువగా నైట్ పార్టీల్లో పాల్గొనేవారని చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు మాత్రం త్వరగా నిద్రపోవడాన్ని ఇష్టపడేవారని గుర్తు చేశాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లాంటి వారు త్వరగా నిద్రపోతారు.. కానీ సౌరభ్ గంగూలీ మాత్రం ఎక్కువగా తన గదిలోనే ఉండేవాడు.. భారీ విజయాలు సాధించినప్పుడు మాత్రం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లమని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌లోనే పాక్ పై సిరీస్ గెలిచిన సందర్భాన్ని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గుర్తు చేసుకుంటూ.. ఆ సిరీస్ నా ఫస్ట్ విదేశీ టూర్.. ఆ రోజు మాత్రం అందరం కలిసి రాత్రి పొద్దుపోయే వరకు ఎంజాయ్ చేశాం.. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. రాహుల్ భాయ్ చాలా బాగా డాన్స్ చేస్తాడు.. ఇది చాలా మందికి తెలియదన్నాడు. మైదానంలో కూల్‌గా, క్రమశిక్షణతో కనిపించే ద్రవిడ్‌కు ఈ టాలెంట్ ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
►ALSO READ | PSL 2026: పాక్– -ఆఫ్ఘన్ మధ్య హై టెన్షన్.. ఆస్ట్రేలియా ప్లేయర్లకు హెచ్చరికతో PSLకి దూరం
అంతేకాదు, 2008 ఐపీఎల్ ఫైనల్ తర్వాత జరిగిన పార్టీకి నన్ను ఆహ్వానించలేదు, అయినప్పటికీ నేను వెళ్లినట్ల శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ తర్వాత పార్టీ జరిగింది.. ఆ పార్టీకి నాకు ఆహ్వానం లేకపోయినా ‘పర్పుల్ క్యాప్’ కోసం వెళ్లాను.. షేన్ వార్న్ లాంటి లెజెండ్స్ అక్కడ ఉండడంతో నేను కూడా పార్టీలో పాల్గొన్నట్లు తెలిపాడు. ఆ సీజన్‌లో శ్రీశాంత్ 19 వికెట్లు తీసుకోగా, పాకిస్థాన్ బౌలర్ సోహైల్ తన్‌వీర్ 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్ నాయకత్వంలో టైటిల్ గెలుచుకుంది.
