ముంబై: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా టైటిల్ వేట మొదలుపెట్టింది. వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా శనివారం (ఫిబ్రవరి 7) అమెరికాతో తలపడుతోంది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సూర్య కుమార్ సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది.
గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమైన హర్షిత్ రాణా స్థానంలో టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లోకి వచ్చిన స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి గేమ్ ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్ లో అట్టర్ ఫ్లాఫ్ అయిన సంజు శాంసన్ తొలి మ్యాచులో బెంచ్‌కు పరిమితమయ్యాడు.
అభిషేక్ శర్మతో పాటు న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన జార్ఖండ్ డైనమేట్ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగే అవకావం ఉంది. మినీ ఇండియాగా పేరొందిన అమెరికా ఏ మేర భారత్ కు పోటీ ఇస్తుందో చూడాలి..
భారత ప్లేయింగ్ XI:
ఇషాన్ కిషన్, అభిషేక్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (సి), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్త, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్
అమెరికా ప్లేయింగ్ XI:
మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, సాయితేజ ముక్కమల్ల, మిలింద్ కుమార్, సంజయ్ క్రిష్ణమూర్తి, శుభం రంజానే, హర్మీత్ సింగ్, మహమ్మద్ మోసిన్, షాడ్లే, అలీ ఖాన్, సౌరబ్ నేత్రవల్కర్
