Kuberaa OTT Review : ధనుష్ 'కుబేరా' విజయయాత్ర .. ప్రైమ్ వీడియోలో రియాక్షన్స్!

Kuberaa OTT Review : ధనుష్ 'కుబేరా' విజయయాత్ర ..  ప్రైమ్ వీడియోలో రియాక్షన్స్!

ధనుష్ ( Dhanush  ), అక్కినేని నాగార్జున( Nagarjuna Akkineni ) , రష్మిక మందన ( Rashmika Mandanna )వంటి భారీ తారాగణంతో  జూన్ 20, 2025న విడులైన  చిత్రం 'కుబేరా' ( Kuberaa ). విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల (  Sekhar Kammula)   డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్లలో ఒక ఊపు ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి భారీగానే వసూళ్లను రాబట్టింది. విడుదలైన తొలి వారంలోనే ఏకంగా రూ.  70 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసింది.  కేవలం నాలుగు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబ్టింది.  సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, దాని అద్భుతమైన సంగీతం, నటీనటుల పవర్‌ఫుల్ నటన, విజువల్స్ విస్తృత ప్రశంసలు అందుకుంది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్.. 
 థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత, 'కుబేరా' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే #KuberaaOnPrime అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది, ఇది సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నిరంతర ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే, ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం థియేటర్లలో వచ్చినంత ఏకపక్ష ప్రశంసలు లభించలేదు. పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, అధికార రాజకీయాల చుట్టూ తిరిగే ఈ 'కుబేరా' కథ, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కుబేరాపై మిశ్రమ స్పందన.. 
 అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. "వాట్ ఎ యాక్టర్ ధనుష్" అంటూ కొందరు ఆయన అద్భుతమైన నటనను పొగిడారు. కానీ, మరికొందరు మాత్రం సినిమా ద్వితీయార్థం, ముఖ్యంగా దాని ముగింపు నిరాశపరిచిందన్నారు. మొదటి భాగం చాలా బాగుంది, కానీ ద్వితీయార్థం పట్టు కోల్పోయింది. రష్మిక నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, క్లైమాక్స్ మాత్రం చప్పగా ఉంది అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. రెండున్నర గంటల పాటు సినిమా డీసెంట్‌గా ఉన్నప్పటికీ, చివరి 30 నిమిషాల్లో ఒక అసంబద్ధమైన ముగింపు ఇచ్చిందిఅని మరికొందరు తమ నిరాశను వ్యక్తం చేశారు. సినిమాకు ఒక బలమైన, సంతృప్తికరమైన ముగింపు లేకపోవడం కొంతమంది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. థ్రిల్లర్ జోనర్‌లోని సినిమాలకు బలమైన ముగింపు అవసరమని, ఆ విషయంలో 'కుబేరా' కొంత వెనుకబడిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

 

డబ్బు, అధికారం, మానవ సంబంధాలు
దర్శకుడు శేఖర్ కమ్ముల 'కుబేరా' చిత్రాన్ని డబ్బు, అధికార రాజకీయాల నేపథ్యంలో రూపొందించారు. సాధారణంగా సౌకర్యవంతమైన జీవితంలోని చీకటి కోణాలను, మానవ సంబంధాలపై వాటి ప్రభావాన్ని ఈ సినిమా ద్వారా చూపించడానికి ఆయన ప్రయత్నించారు. "పోయి వా" పాట తర్వాత కథలో ఒక పెద్ద మలుపు ఉంటుందని ఆశించిన అభిమానులు, చివరి 30 నిమిషాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై నిరాశ చెందారు. కథనం చివరి అంకంలో కొంత పట్టు కోల్పోయిందని, మరింత పకడ్బందీగా ముగించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ధనుష్ పాత్రలోని భావోద్వేగ లోతు, ఆయన నటన మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

మొత్తం మీద, 'కుబేరా' థియేటర్లలో భారీ విజయం సాధించినప్పటికీ, ఓటీటీలో మాత్రం మిశ్రమ సమీక్షలను పొందింది. అయినప్పటికీ, తారాగణం అందించిన కృషి, ముఖ్యంగా ధనుష్ , జిమ్ సర్బ్ నటన, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాను ఒక ప్రత్యేక చిత్రంగా నిలిపాయి. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, ఓటీటీలో సినిమాకు వచ్చిన స్పందనలు సినిమా నిర్మాణంలో కథనం, ముగింపు ఎంత కీలకమో మరోసారి గుర్తుచేశాయి.