Vijay Deverakonda: OTT లోకి విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'.. భారీ డీల్ కు‌ సొంత చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

Vijay Deverakonda: OTT లోకి విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'.. భారీ డీల్ కు‌ సొంత చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda )  కథనాయకుడిగా జేర్సీ ఫేమ్  దర్శకుడు గౌతమ్ తిన్ననూరి  డైరెక్షనల్ లో తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్' ( Kingdom ).  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.  దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి.  దీనిని జూలై 31న  గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా అయ్యారు.  ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'కింగ్ డమ్' నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సాధించలేపోయాయి. దీంతో నిరాశలో ఉన్న ఆయనకు తన తదుపరి చిత్రంపై భారీ ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో 'కింగ్ డమ్'కు భారీ OTT డీల్ దక్కడం ఆయన క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ కు ముందే దాదాపు రూ. 50 కోట్ల ఓటీటీ డీల్ దక్కడం కాస్త ఊరట నిచ్చింది.  ఇది నిర్మాతల పెట్టుబడికి గణనీయమైన భద్రతను అందిస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

'కింగ్ డమ్' సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపారు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద డీల్ అని చెప్పుకొస్తున్నారు.  నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాపై ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించడం అంటే 'కింగ్ డమ్' కంటెంట్ పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ALSO READ : Tollywood : రెమ్యునరేషన్లు తగ్గించుకోండి.. అగ్ర తారలు, దర్శకులను కోరుతున్న నిర్మాతలు!

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బొర్సె( Bhagyashree Borse ) హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పవర్ఫుల్ నటుడు సత్యదేవ్ (Satya Dev )కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ( Anirudh Ravichander ) సంగీతం అందిస్తుండటంతో, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  చిత్రాన్ని జూలై 31న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.