
ఒక సినిమాను తెరకెక్కించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారంకాదు. భారీ తారాగణం, దర్శకుడు, టెక్నిషియన్లు, బడ్జెట్ వంటి ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అయితే రాను రాను సినిమాల బడ్జెట్ తడిసి మోపెడు అవుతోంది. ఐదారు కోట్ల రూపాయాల నుంచి వేల కోట్లలోకి రూపాయల్లోకి మారిపోయింది. ప్రస్తుత నెలకొన్న మార్కెట్ పరిస్థితుల్లో సినిమా హిట్ అయితే సరిపోదు.. అది లాభాదాయకంగా ఉండాలి. వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు కూడా కలెక్షన్ల వద్దకు వచ్చే సరికి బొల్తా పడుతున్నాయి. దీంతో నిర్మాతలు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు. చివరికి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, సవాళ్ల నేపథ్యంలో నిర్మాతలు తమ సినిమా బడ్జెట్ లను తగ్గించుకోవాలని దర్శకులను కోరుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కూడా వ్యయ నియంత్రణకు లోబడి పనిచేయాల్సి పరిస్థితి వచ్చిందని సూచిస్తున్నారు. నటీనటులతో పాటు దర్శకుడి, ఇతర ప్రధాన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరుతున్నారు. అంతే కాదు సినిమా షూటింగ్ రోజులను కూడా పరిమితులు విధించుకోవాలన్న ప్రతిపాదనలు నిర్మాతలు తీసుకువస్తున్నట్లు సమాచారం.
సినిమా బడ్జెట్ తగ్గించుకోండి బాబు..
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బాస్టర్ మూవీ అనంతరం మెగస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబాతో కలిసిన పిచేయాడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. అయితే నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ ను పునర్ పరిశీలన చేయమని బాబిని నిర్మాతలు కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఇందులో దర్శకుడి, ఇతర ప్రధాన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ తగ్గించుకోవడంతో పాటు షూటింగ్ రోజులను తగ్గించుకోవడం వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన భారీ వ్యయాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరో వైపు 'వీరసింహారెడ్డి' వంటి మాస్ హిట్‌ను అందించిన తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరోసారి జట్టు కడుతున్నారు. ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు, అతని బృందం బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించాలని కోరినట్లు సమాచారం. షూటింగ్ షెడ్యూల్‌లను పరిమితం చేయడం, నిర్మాణ ఖర్చులను తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు. స్టార్ డమ్ ఉన్నా సరే, బడ్జెట్ విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయాని నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది.
ALSO READ : Alia Bhatt: ఆలియా భట్ ఔదార్యం.. డ్రైవర్, ఇంట్లో పని చేసే వారికి 1 కోటి రూపాయల ఖరీదైన గిఫ్ట్!
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర పార్ 1 విజయవంతమైంది. అయితే దీని సీక్వెల్ కోసం ప్లాన్ రెడీ అవుతోంది. తొలి భాగం విజయం సాధించినా, దాని అధిక నిర్మాణ వ్యయం మొత్తం లాభాలపై ప్రభావం చూపింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండటానికి, కొరటాల శివ'దేవర 2'ను మరింత కఠినమైన సమయపాలనతో, నియంత్రిత బడ్జెట్‌తో సిద్ధం చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులు కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉండే విధంగా నిర్మించాలని శివను నిర్మాతలు కోరినట్లు సమాచారం.
మరో వైపు 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, విజయ్ దేవరకొండతో కలిసి ఒక హై-ప్రొఫైల్ హిస్టారికల్ డ్రామాను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదట అత్యంత భారీగా ప్లాన్ చేసినప్పటికీ, నిర్మాతలు ఖర్చులను తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వరుస ఆపజయాలతో ఉన్న విజయ్ దేవరకొండ.. నిర్మాత ప్రతిపాదనలకు ఒకే చెప్పినట్లు సమాచారం. తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది నటుల నుంచి కూడా వ్యయ నియంత్రణకు మద్దతు లభిస్తుందని రుజువు చేస్తుందని అభిమానులు అభ్రిపాయపడుతున్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సినీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. నిర్మాతల ప్రతిపాదనలు, సూచనలు తెలుగు సినీ పరిశ్రమలో మరింత జాగ్రత్తగా, లెక్కగట్టిన విధానాన్ని సూచిస్తున్నాయి. క్రియేటివ్ ఉత్సాహం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులలో నిర్మాతలు ఆశయం, ఆర్థిక సాధ్యత మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం బడ్జెట్ కోతలు మాత్రమే కాదు, నిర్మాణ ప్రణాళికలో ఒక నూతన దృక్పథం. దీని ద్వారా సినిమాలు కేవలం విజయవంతం కావడమే కాకుండా, లాభదాయకంగా కూడా మారతాయని అభిప్రాయపడుతున్నారు.