ఫిబ్రవరి 12న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ నౌ ఇండియా

ఫిబ్రవరి 12న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్  నౌ ఇండియా

హైదరాబాద్​, వెలుగు: ఈ నెల 12న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అన్వయ కన్వెన్షన్స్‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ నౌ 2026 ఇండియా కార్యక్రమం జరగనుంది. ఎన్‌‌‌‌‌‌‌‌టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహిస్తున్న ఈ వేదికపై 1,500 మందికి పైగా పరిశ్రమ నిపుణులు ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్​మిషన్​పై చర్చించనున్నారు. ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా డేటా ఆధారిత వ్యూహాలను ఎలా అమలు చేయాలో వివరిస్తారు. ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా కీలక ప్రసంగం చేయనున్నారు. ఏఐ అరేనా, ఇన్నోవేషన్ హబ్ వంటి 15 ఎక్స్​పీరియెన్స్​ జోన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.