
సినీ తారలు తమ విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తమ గొప్ప మనసుతో , ఔదార్యంతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ( Alia Bhatt ) అలాంటి కోవకే చెందుతుంది. తన డ్రైవర్ సునీల్ తో పాటు ఇంట్లో పనిచేసే అమోల్ లకు తను చేసిన ఆర్థిక సాయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఆలియా భట్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ విలువైన బహుమతిని సునీల్, అమోల్ లకు అందించిందించినట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. వీరిద్దరూ ఆలియా భట్ తన సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆమెతోనే ఉన్నారు. వారిని కేవలం పనివాళ్లుగా కాకుండా తన కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. అందుకే ఆమె వారి పట్ల ఇంతటి ఔదార్యం చూపించిదని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ డబ్బుతో వారిద్దరూ ఇల్లు కొనుక్కోవాలని ఆలియా భట్ సూచించారు. వారిద్దరూ ఇప్పుడు ముంబైలోని జుహూ, ఖార్ ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూం ఇళ్లను కొనుగోలు చేస్తున్న సమాచారం.
ALSO READ : KBC: కౌన్ బనేగా కరోడ్ పతికి అమితాబ్ ఎంత తీసుకుంటారో తెలుసా? టీవీ షోల పారితోషికాల్లో రికార్డు!
సాధారణంగా సెలబ్రిటీలు తమ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. కానీ ఆలియా భట్ తన వద్ద పనిచేస్తే వారిని తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూడటం ఆమె వ్యక్తత్వానికి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తమ కోసం నిరంతరం శ్రమించే వారికి గుర్తింపునివ్వడం, ఆర్థిక భద్రత కల్పించడంలో ఆలియా గొప్ప మనసును చాటుకున్నారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.