
చరిత్ర సృష్టించిన బుల్లితెర షోలలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(Kaun Banega Crorepati) ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan)హోస్ట్గా 2000 సంవత్సరంలో మొదలైన ప్రముఖ ఈ క్విజ్ షో.. గత 22 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
అంతేకాదు..ఈ ప్రోగ్రాం వ్యూవర్స్ను టీవీల ముందు కట్టిపడేస్తుందంటే ఆశ్చర్యం లేదు. 16 ఎపిసోడ్లు కంప్లీట్ చేసికున్న ఈ కౌన్ బనేగా కరోడ్ పతి షో కొత్త సీజన్ రాబోతోంది. ఈ సీజన్‌కు కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ 16 సీజన్స్‌తో సక్సెస్‌ఫుల్ రన్ కాగా, ఇటీవలే, 17వ సీజన్‌ను అనౌన్స్ చేశారు. ఈ కొత్త సీజన్కు బిగ్ బి అత్యధిక పారితోషికం పొందుతున్న టీవీ హోస్ట్‌గా నిలిచారు.
ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుబోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే, ఆయన వారపు జీతం రూ.25 కోట్లు సంపాదిస్తున్నాడన్నమాట. హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే అతని వారపు జీతం రూ.10 కోట్లు అవుతుంది. ఎందుకంటే, హోస్ట్ వారాంతాల్లో మాత్రమే ఈ షోలో కనిపిస్తాడు కాబట్టి! దీంతో ఎపిసోడ్‌కు దాదాపు రూ.5 కోట్లు వసూలు చేయడం ద్వారా, బిగ్ బి ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యధికంగా చెల్లించే టెలివిజన్ హోస్ట్‌గా నిలిచారు.