ఫిబ్రవరి 6 నుంచి గ్లోబల్ సోలార్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో

ఫిబ్రవరి 6 నుంచి గ్లోబల్ సోలార్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ సోలార్ ​ఎక్స్​పో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌లో ఈ నెల 6,7 తేదీల్లో జరుగుతుంది.  దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సమావేశంగా నిలవనున్న ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు 10 వేల మందికి పైగా సందర్శకులు రానున్నారు. వ్యాపార విధానాలు, వ్యాపారం, సాంకేతికతల కలయికగా ఇది నిలుస్తుందని వ్యవస్థాపకుడు ఆనంద్ గుప్త తెలిపారు. ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోలో సూర్యకాన్ కాన్ఫరెన్స్, తెలంగాణ  సోలార్ అవార్డులు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పునరుత్పాదక శక్తి రంగాన్ని కొత్త దశకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆనంద్​ వివరించారు.