హైదరాబాద్: హెటెక్ సిటీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నరోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC), విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీసుల మధ్య ఇటీవల జరిగిన సమన్వయ సమావేశం తరువాత పనులు మొదలయ్యాయి. హైటెక్ సిటీలోని లెమన్ ట్రీ – ట్రైడెంట్ హోటల్ మధ్య కిలోమీటరు పొడవున్న ఈ కారిడార్ సైబరాబాద్ ఐటీ బెల్ట్‌కు కీలకమైన లింక్. ముఖ్యంగా రాహేజా మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగుల ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీ అధికారుల అంచనా ప్రకారం.. రోజు 5 లక్షల మంది ఉద్యోగులు ఈ రూట్ లో రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్డు విస్తరణ ప్రతిపాదనకు 2025లోనే ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ 2025, ఆగస్టు చివరి నాటికి ప్రారంభమవుతుందని అధికారులు భావించారు. కానీ ప్రధాన భూగర్భ విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఇతర అనుమతులు రాకపోవడంతో పనులు మొదలు కాలేదు.
ALSO READ : ఆ వైర్లను మార్చి 31లోగా తొలగించాలి
ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో అధికారులు 2026 జనవరిలో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 11 kV, 133 kV సామర్థ్యం గల రెండు ప్రధాన విద్యుత్ కేబుల్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఉన్న రెండు లేన్లను మూడు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే సుమారు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు 30 నిమిషాల వరకు సమయం ఆదా అవుతోంది.
ALSO READ : డ్రంక్ అండ్ డ్రైవ్‍లో 11 సార్లు దొరికిండు..
మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో దశలో ట్రైడెంట్ హోటల్ సమీపంలోని రాతి గుట్టను తొలగించి కొత్త లేన్ కోసం స్థలం క్రియేట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రాత్రి వేళల్లో రోడ్డు విస్తరణ పనులు చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక లేన్ ను తాత్కలికంగా మూసివేశామని.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఐదు నెలల నుంచి సంవత్సరం వరకు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు రోడ్లపై ట్రాఫిక్ నరకయాతన తప్పనుంది.
