మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పెద్ది' ( Peddi) . ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఈ మూవీ విడుదల తేదీపై సందిగ్థత నెలకొంది. మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. దీంతో మెగా అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. వాటన్నింటికి చెక్ పెడుతూ దర్శకుడు బుచ్చిబాబు ఒక సడన్ సర్ప్రైజ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు. రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
'పెద్ది' విడుదల తేదీ ఖరారు!
మొదట ఈ చిత్రాన్ని చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'మగధీర' విడుదలైన మార్చి 27వ తేదీన (2026) రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ తేదీ కంటే ఒక రోజు ముందు ( 26, మార్చి 2026 ) పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలోకి రానుంది. దీంతో అటు బాబాయి పవన్ కోసం రామ్ చరణ్ తన సినిమా 'పెద్ది' వాయిదా వేశారన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ గాఈ సినిమా 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి అధికారిక ముందస్తు ప్రకటన లేకుండా బుచ్చిబాబు ఈ డేట్‌ను రివీల్ చేయడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
The date of his arrival changes, but not his MIGHTY GRIT ❤️🔥
— BuchiBabuSana (@BuchiBabuSana) February 4, 2026
#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026.
Mega Power Star
@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu… pic.twitter.com/AayRs6zvkO
భారీ స్టార్ కాస్ట్ తో బరిలోకి..
ఈ సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తోంది. ఆమె పల్లెటూరి యువతిగా ఒక కొత్త లుక్‌లో కనిపించనుంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ, సీనియర్ నటులు జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు తన మునుపటి సినిమా 'ఉప్పెన' లాగే ఈ సినిమాను కూడా ఒక మ్యూజికల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారట.
కథా నేపథ్యం ఏంటి?
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం మేకోవర్ మార్చుకుని సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సమ్మర్ రేసులో ఏప్రిల్ 30న రాబోతున్న ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
