నిందలు వేయటం తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదు.. బనకచర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నిందలు వేయటం తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదు.. బనకచర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బనకచర్ల అంశంలో నిందలు వేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. గోదావరి జలాల వినియోగం గురించి రేవంత్ రెడ్డి ఏమైనా కార్యాచరణ రూపొందించారా ? అని ప్రశ్నించారు.  బనకచర్ల అంశంపై ప్రధానమంత్రిని, జలశక్తి మంత్రి నీ స్వయంగా మూడు సార్లు కలిసి, తెలంగాణ వాదన వినాలని కోరినట్లు చెప్పారు.  ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ హక్కులను కాపాడే ప్రయత్నంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీకి ఇద్దరు ముఖ్యమంత్రులను జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలేదని.. ఫెలిసిటేటర్ గా కేంద్రం పిలిచిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇద్దరు సీఎంలు కలిసి చేర్చుకునేలా కేంద్రం చర్యలు తీసుకుందని అన్నారు.  శ్రీశైలం డ్యాం రిపేర్ చేయాలని, టెలీమెట్రి వాడాలని ఇరు ఇరువురు చర్చించుకున్నట్లు చెపపారు.  శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని అన్నారు. 

అధికారంలో ఒక పాలసీ, ప్రతిపక్షంలో మరో పాలసీ:

 BRS నేతలది అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పాలసీ అని విమర్శించారు కిషన్ రెడ్డి. BRS మాదిరిగా బీజేపీ పాలసీ మారదని చెపపారు. కేసీఆర్ అపరిచితుడిలా మాట్లాడతారని.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ALSO READ : నాకు తమ్ముడి లాంటివాడు.. లోకేష్ను కలిస్తే తప్పేంటి.?

రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని.. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా లోనే లోపం ఉందని అన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది అని..  ఒక్కో బస్తాకు రూ.2 వేల 6 వందల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎరువుల ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 

 ముస్లీం రిజర్వేషన్లు అందని వారిని EBC కిందకు తెచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  GHMC ఎన్నికల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశారని.. కానీ  ఇప్పుడు 32 శాతానికి బీసీ తగ్గిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసే, కొంప ముంచే రిజర్వేషన్లు ఇస్తుందని విమర్శించారు. ఈ విషయంలో బీసీ సంఘాల నేతలు ఆలోచన చేయాలని సూచించారు.  రాజకీయ, ఓటు బ్యాంక్ ముసుగులో బీసీలను అన్యాయం చేస్తున్నారని..  నిజమైన బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక మహారాష్ట్రలో తెలంగాణ గ్రామాలను విలీనం  చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ప్రజలు.. అక్కడ ప్రజలు  ఒప్పుకుంటే పార్లమెంట్ లో చట్టం చేస్తామని తెలిపారు.