Pawan Kalyan : OTTలోకి 'హరి హర వీరమల్లు'.. భారీ రేటుకు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్!

Pawan Kalyan : OTTలోకి 'హరి హర వీరమల్లు'.. భారీ రేటుకు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' ( Hari Hara Veera Mallu ) చిత్రం విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజులలో (  జూలై 24, 2025 ) ప్రేక్షకుల ముందుకు రానుంది.  భారీ అంచనాలతో  రూపుదిద్దుకున్న ఈ మూవీ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పవన్ పవర్ ఫుల్ ట్రైలర్ తో ఫ్యాన్స్ లో విపరీతమైన బస్ క్రియేట్ చేసింది.  'బ్రో ' ( 2023 ) తర్వాత ఈ మాస్ హీరో నటిస్తున్న తొలి సినిమా ఇదే. 

 ఏ.ఎం. రత్నం సమర్పణలో తెరకెక్కిస్తున్న 'హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదల కానుంది.  ఈ క్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను  విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  ఈ వేడుకకు దర్శకదీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా, ఇప్పటికే రికార్డుల వేటను ప్రారంభించింది. సినిమా విడుదల కావడానికి వారం రోజులు ఉన్నప్పటికీ, యు.ఎస్.ఎ. (USA) లో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డులు సృష్టిస్తోంది.

మరో వైపు హరి హర వీరమల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సుమారు రూ. 250 కోట్లతో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగానే బిజినెస్ జరిగిందని టాక్ .  థియేట్రికల్ గా ఈ చిత్రానికి రూ. 150 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అటు OTT బిజినెట్ రూ. 60 కోట్ల మేరకు అయ్యిందని సమాచారం.  థియేటర్లలో రన్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లో హరి హర వీరమల్లు ప్రసారం కానుంది.  షూటింగ్ పూర్తి కాకముందే ఈ హక్కులను సొంతం చేసుకుంది.

ALSO READ : 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రానికి మిశ్రమ స్పందన.. అంచనాలు అందుకోలేకపోయిన కోర్టు డ్రామా!

 పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం, భారీ సెట్టింగ్‌లు, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,  గ్రాఫిక్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. నిధి అగర్వాల్ ( Nidhi Agerwal ), నోరా ఫతేహి (Nora Fatehi) వంటి నటీమణులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్ ( Bobby Deol )కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రానికి  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి , ఎఎం జ్యోతి కృష్ట దర్శకత్వం వహించారు.ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది . పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపు అయ్యింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించబోతుందో చూడాలి.