
టైటిల్ వివాదంతో విడుదలకు ముందే సంచలనం సృష్టించిన చిత్రం 'జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ'( Janaki V vs State of Kerala ). కోర్టు వివాదాల తర్వాత ఎన్నో అంచనాలతో గురువారం ( జూలై 17, 2025 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ గోపి ( Suresh Gopi ) , అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు అందుకోలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన అనంతరం అభిమానులు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
కథా నేపథ్యం..
ఈ మూవీలో జానకి వి ( అనుపమ పరమేశ్వరన్ ) అనే బెంగళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ చూట్టూ కథ తిరుగుతుంది. ఆమె కేరళకు తిరిగి వచ్చిన తర్వాత అత్యాచారానికి గురవుతుంది. దీంతో న్యాయం కోసం పోరాటం చేస్తుంది. ఈ సమయంలోనే అడ్వకేట్ డేవిడ్ అబెల్ డోన్ వన్ ( సురేష్ గోపి ) ప్రవేశంతో ఆమె పోరాటం నాటకీయంగా మలుపు తిరుగుతుంది. అయితే ఈ చిత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయిందని అభిమానులు విమర్శిస్తున్నారు.
Also Read:-బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అనుపమ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్
న్యాయం చేయలేకపోయిన సురేష్ గోపి
మంచి కథను సోమరితనంతో కూడిన దర్శకత్వం నాశనం చేసిందని సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమర్థవంతమైన నటీనటులు ఉన్నా.. వారి బలహీనమైన నటన, దర్శకత్వం, నిస్తేజమైన రచనతో ఈ కోర్టు డ్రామా చిత్రం అశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయిందని అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. సురేష్ గోపి తన పాత్రకు న్యాయం చేయలేకపోయారు. కానీ అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు చక్కగా న్యాయం చేశారని నెటిజన్లు ప్రశంసించారు. కానీ కోర్టు దృశ్యాలు చాలా మూములుగా ఉన్నాయి. మొదటి బాగం పర్వాలేదు అనిపించినా.. రెండో భాగం మాత్రం నిరుత్సాహంగా, గందరగోళం ఉందని అభిప్రాయపడ్డారు.
అనుపమ ఒకే..
మరి కొందరు రాజకీయ ప్రేరేపిత చిత్రాలతో పోల్చారు. అంతే కాదు వివేక్ అగ్నిహోత్రి సినిమాల లాగే ఇది ఒక కోర్టు రూము థ్రిల్లర్ ముసుగులో ఉన్న ప్రచారం అని పోస్టు చేశారు. ప్రధాన నటీనటులు కూడా ఈ మూవీని కాపాడలేకపోయారు. సురేష్ గోపి డైలాగ్ లు ఇబ్బంది కరంగా ఉన్నాయి. సగటు అభిమానులు ఆశించిన స్థాయిలో లేడని ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు కొంత న్యాయం చేసినప్పటికీ.. అది సరిపోదని అభిమానులు తమ అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీతం పర్వాలేదనిపించినా .. మొత్తానికి 'జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ అభిమానులను నిరాశపరిచిందన్న అభిప్రాయం సగటు ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది.