Anupama Parameswaran: బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అనుపమ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్

Anupama Parameswaran: బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అనుపమ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’మూవీ ఆగస్ట్ 22 విడుదల కానుంది. నేడు (జూలై17న) పరదా నుండి 'యాత్ర నార్యస్తు' అనే సెకండ్ సింగిల్ రిలీజ్ సందర్భంగా అనుపమ అండ్ పరదా మేకర్స్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించించారు. ఆలయ అధికారులు అనుపమకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పరదా మూవీ విషయానికి వస్తే.. 

'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. ఆనంద మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు నటి సంగీత, దర్శన రాజేంద్రన్‌, రాగ్ మయూర్‌ ఇంకా పలువురు యంగ్‌ స్టార్స్ కీలకపాత్రలు పోషించారు.

విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరదాలు అమ్మే ‘సుబ్బు’ అనే అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికీ రిలీజైన టీజర్,సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలు పెంచాయి. గోపీ సుందర్ సంగీతం అందించాడు. 

►ALSO READ | Kannappa: 'కన్నప్ప'కు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన!