ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులే.. చర్యల్లేవ్ : కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులే.. చర్యల్లేవ్ : కిషన్ రెడ్డి
  •     కేసీఆర్, రాహుల్​మధ్య ఒప్పందం కుదిరింది: కిషన్ రెడ్డి 

మహబూబ్​నగర్ అర్బన్, వెలుగు: ఫోన్​ట్యాపింగ్​కేసులో సిట్​ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం తప్ప, ఎవరిపై చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్​సీఎం కాకముందు బీఆర్ఎస్​పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 

తాను సీఎం అయితే వాళ్లు జైలులో ఉంటారని చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి రేండేళ్లు దాటినా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కేసీఆర్, రాహుల్​మధ్య ఒప్పందాలు కుదిరాయి. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘మేం కొట్టినట్టు చేస్తం.. మీరు ఏడ్చినట్టు చేయండి’ అన్నట్టుగా ఈ రెండు పార్టీల వ్యవహారం ఉందని విమర్శించారు. ఫోన్​ట్యాపింగ్​కేసులో నిందితుడైన డీఎస్పీని సీఐగా డిమోషన్​చేశారని, ఈ కేసులో కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకున్న చర్య ఇదేనని ఎద్దేవా చేశారు.  

బీజేపీ అంటే కాంగ్రెస్‌‌‌‌కు భయం: రాంచందర్ రావు

బీజేపీ అంటే కాంగ్రెస్​పార్టీకి భయమని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు. ‘‘భైంసాలో మత ప్రచారం చేస్తున్నారని మాపై ఆరోపణలు చేశారు. కానీ సీఎం రేవంత్​ రెడ్డి రాష్ర్టంలో మత రాజకీయాలు చేస్తున్నారు. ‘కాంగ్రెస్​అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్’​ అని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌కు అహంకారం పెరిగింది. ఈ అహంకారం వల్లనే బీఆర్ఎస్‌‌‌‌ను ప్రజలు ఫాంహౌస్‌‌‌‌కు పరిమితం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటుతుంది” అని అన్నారు. కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతున్నదని ఎంపీ డీకే అరుణ అన్నారు.