2.5 కోట్ల ‘ఆధార్’‎లు రద్దు.. లోక్ సభలో కేంద్ర మంత్రి జితిన్

2.5 కోట్ల ‘ఆధార్’‎లు రద్దు.. లోక్ సభలో కేంద్ర మంత్రి జితిన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్లకుపైగా ఆధార్ నంబర్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని కాపాడటంతో పాటు, గుర్తింపు కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. బుధవారం లోక్‌‌‌‌సభలో ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

‘‘ఐడెండిటీ ఫ్రాడ్ జరగకుండా, పథకాల లబ్దిదారుల్లో అనర్హులు లేకుండా ఉండేందుకు మరణించిన వారి ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేయాలి. ఇందుకోసం 2.5 కోట్లకుపైగా ఆధార్ నంబర్లను రద్దు చేశాం” అని పేర్కొన్నారు.