Kannappa: 'కన్నప్ప'కు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన!

Kannappa: 'కన్నప్ప'కు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన!

మంచు విష్ణు ( Vishnu Manchu ) కథానాయకుడిగా నటించిన బారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప' ( Kannappa ) కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాను రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.  ఈ అరుదైన గౌరవాన్ని తెలియజేస్తూ.. చిత్ర బృందం తమ అధికారిక X ఖాతాలో తమ ఆనందాన్ని పంచుకుంది. ఇది మాటల్లో చెప్పలేనంతం గౌరవం.  రాష్ట్రప్రతి భవన్ లో తమ  సినిమా ప్రత్యేక ప్రదర్శనను అందుకుంది.  ఇది భక్తితో కూడిన కథనానికి, సాంస్కృతిక ప్రాముఖ్యతకు సగర్వ గుర్తింపు. హార్ హర్ మహదేవ్.. హర ఘర్ మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు. 

భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈచిత్రాన్ని చూసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు విష్ణు నటనను ప్రశంసించారు. పౌరాణిక ఇతిహాసంగా తెరకెక్కిన ఈ మూవీలో మోహన్ బాబు,  మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్రతారలు నటించడంతో సినిమాకు మరింత వన్నె తెచ్చిందన్నారు.  మహాభారత్ టెలివిజన్ సిరీస్ తో పేరుపొందిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నప్ప చిత్రం అత్యంత సాంకేతిక విలువలతో , భక్తి శ్రద్ధలతో అందరిని ఆకట్టుకుందని కొనియాడారు. 

Also Read : టెక్నిషియన్స్‌పై డైరెక్టర్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

 

అయితే ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి సినీ ప్రియులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబ్టలేకపోయింది. సుమారు రూ. 200 కోట్ల మేర బడ్జెట్ ఖర్చు చేయగా.. కలెక్షన్లలో మాత్రం బొల్తా పడిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో వైపుఈ మూవీని OTTలోకి తీసుకువచ్చేదానిపై చర్చలు కొననసాగుతున్నట్లు సమాచారం. 

'కన్నప్ప' చిత్రంలో విష్ణు మంచు తిన్నడు అనే ధైర్యవంతుడైన యోధుడి పాత్రను పోషించారు. అతని ప్రయాణం అతడిని భక్త కన్నప్పగా, అంటే శివుని భక్తుడిగా మారుస్తుంది. అక్షయ్ కుమార్ ( Akshay Kumar)పరమశివుని దివ్య రూపాన్ని పోషించగా, ప్రభాస్ ( Prabhas ) రుద్రుడిగా కథనానికి తీవ్రతను, రహస్యాన్ని జోడించారు. మోహన్‌లాల్ (  Mohanlal ) కిరాతుడి పాత్రలో శక్తివంతమైన పాత్రలో కనిపించి, తన ఉనికితో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ అద్భుతమైన నటీనటుల సమష్టి కృషి, అత్యున్నత సాంకేతిక విలువలు 'కన్నప్ప'ను ఒక దృశ్య కావ్యంగా మార్చాయి.  కానీ మూవీ మేకర్స్, అభిమానులు ఆశించిన స్థాయిలో మాత్రం బాక్సీపీస్ వద్ద సక్సెస్ ను అందుకోలేకపోయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.