గుడ్ న్యూస్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు ..నెలకు రూ. లక్ష వరకు జీతం

గుడ్ న్యూస్ :  బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు ..నెలకు రూ. లక్ష వరకు జీతం

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మేనేజర్, ఆఫీసర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బీఓబీలో  కెరీర్ నిర్మించుకోవడానికి ఐటీ నిపుణులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్​కు చివరి తేదీ ఫిబ్రవరి 19.

ఖాళీలు: 418. 
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ మేనేజర్ – డెవలపర్ ఫుల్​స్టాక్ జావా 28, మేనేజర్ – డెవలపర్ ఫుల్​స్టాక్ ఎంఈఆర్ఎన్ 34, ఆఫీసర్ – క్లౌడ్ ఇంజినీర్ 11, మేనేజర్ – ఏఐ ఇంజినీర్ (జనరల్ ఏఐ/ ఎన్ఎల్ పీ/ ఎంఎల్) 23, సీనియర్ మేనేజర్ – డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 16, మేనేజర్ – డేటా ఇంజినీర్ 08. 
ఎలిజిబిలిటీ:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీ, లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో బీఈ/ బి.టెక్./ ఎం.టెక్./ ఎంఈ/ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. 
జావా, ఎంఈఆర్ఎన్,  క్లౌడ్, ఏఐ/ ఎంఎల్, ఒరాకిల్, సిస్కో లేదా రెడ్​హాట్‌లో సర్టిఫికేషన్‌ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఐటీ విభాగంలో కనీసం ఏడాది నుంచి ఐదేండ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 22 నుంచి 37 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 30.
అప్లికేషన్ ఫీజు: అన్​రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.175.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి19. 
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్​లైన్ టెస్ట్, సైకో​మెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్​లైన్ టెస్ట్: ఆబ్జెక్టి విధానంలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 225 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 
రీజనింగ్ 25  మార్కులు, ఇంగ్లిష్ 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 మార్కులు, పర్సనల్ నాలెడ్జ్ 150 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 
పూర్తి వివరాలకు     bankofbaroda.bank.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

వేతనం: నెలకు రూ. 48 వేల నుంచి లక్షా 5 వేల వరకు