3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో కోణం: నాన్నకు 2 కోట్ల అప్పు.. 16 ఏళ్లకే పెళ్లి ఒత్తిడి..?

3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో కోణం: నాన్నకు 2 కోట్ల అప్పు.. 16 ఏళ్లకే పెళ్లి ఒత్తిడి..?

లక్నో: ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు అక్కాచెల్లెలు అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‎లోని ఘజియాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని కట్టడి చేయడంతోనే ముగ్గురు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పోలీసుల లేటేస్ట్ ఎంక్వైరీలో 3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. చనిపోయిన ముగ్గురు అక్కాచెల్లెలు కొరియన్ పేర్లతో ఇటీవల సోషల్ మీడియా ఖాతాలు సృష్టించారు. వీరి అకౌంట్లకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. 10 రోజుల క్రితం ఈ విషయాన్ని బాలికల తండ్రి చేతన్ కుమార్ గుర్తించాడు. అకౌంట్లు డిలీట్ చేసి వారి ఫోన్లు లాక్కున్నాడు. ఫోన్లు లేకపోవడంతో గేమ్ ఆడటం, సోషల్ మీడియా ఉపయోగించలేక ముగ్గురు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

ఇంట్లో ఆర్థిక సంక్షోభం

వ్యాపారైన బాలికల తండ్రి చేతన్ కుమార్ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడని అధికారులు వెల్లడించారు. వ్యాపారంలో దాదాపు రూ.2 కోట్లు లాస్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలికల మొబైల్ ఫోన్‌లను విక్రయించి ఆ డబ్బును ఇంటి కరెంట్ బిల్లు కట్టాడు. పిల్లల ఫీజులు కట్టలేక కొవిడ్ సమయం నుంచి వారిని పాఠశాలకు పంపడం లేదు. మరోవైపు కూతుర్ల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం ఉన్న చేతన్ కుమార్ పెళ్లిళ్లు చేస్తానని హెచ్చరించాడు. ఒకవైపు ఫోన్లు లాక్కోవడం.. మరోవైపు పెళ్లి చేస్తామని హెచ్చరించడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలికలు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 

‘సారీ పప్పా..’ అంటూ లేఖ

బాలికలు ముగ్గురూ కొరియా కల్చర్​పై విపరీతమైన అభిమానం పెంచుకున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమను తాము కొరియన్లుగా భావించుకున్నారు. ఆ పేర్లతోనే ఒకరినొకరు పిలుచుకునేవారు. మొబైల్ ఫోన్‌‌‌‌‌‌ వాడకుండా కట్టడి చేయడంతో ఒంటరితనం ఫీలై మానసికంగా కుంగిపోయారు. ఆపై ముగ్గురూ కలిసి తాము ఉంటున్న తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకి చనిపోయారు. 

ఈ ఆత్మహత్యల వెనక ఆన్ లైన్ గేమ్ పాత్ర ఉందని తొలుత అనుమానించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ తర్వాత కొరియన్ లవ్ గేమ్ ప్రభావంతోనే ముగ్గురు బాలికలు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, చనిపోయే ముందు ఆ బాలికలు తమ తండ్రిని ఉద్దేశంచి ఓ పేపర్ సారీ పప్పా.. మా డైరీని చూడండి. అందులో రాసినవన్నీ నిజమేనని లేఖ రాశారు.