వెయ్యికిపైగా స్క్రీన్స్లో జూనియర్: టెక్నిషియన్స్‌పై డైరెక్టర్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వెయ్యికిపైగా స్క్రీన్స్లో జూనియర్: టెక్నిషియన్స్‌పై డైరెక్టర్ రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పొలిటీషియన్, బిజినెస్మెన్ గాలి జనార్దన్ రెడ్డి పేరు అందరికీ సుపరిచితం. ఇప్పుడాయన కుమారుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘జూనియర్’ (Junior). రాధా కృష్ణ దర్శకుడు. ఈ మూవీలో సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది. చాలా కాలం తర్వాత తిరిగి జెనీలియా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. రేపు శుక్రవారం (జూలై 18న) విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ క్రమంలో బుధవారం రాత్రి (జూలై16న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్గా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జెనీలియా, కిరీటి, సెంథిల్, దేవి శ్రీ ప్రసాద్ తదితర టెక్నిషియన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జక్కన్న. 

ALSO READ : అమెరికాలో పెద్ద డాక్టర్ అయ్యుండి.. ఇక్కడికొచ్చి సిన్మాలు తీస్తుంది: రానా దగ్గుబాటి

రాజమౌళి మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. నిర్మాత సాయి గారు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మంచి స్టోరీతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను. కానీ, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ గారు, దేవి శ్రీ,సెంథిల్, పీటర్ హెయిన్స్, ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారో అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడే అర్ధమైంది. ఇదొక భారీ సినిమా అని.

ఎందుకంటే.. జూనియర్ మూవీ 1000 + ప్లస్ స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్‌లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్‌కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్‍కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను.

ఎన్ని ఏళ్లయినా జెనీలియా అలానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఎప్పుడు కూడా తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేస్తాడు. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయిందో మళ్లీ దాని గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయించిన సాంగ్ అదని అన్నారు.

అలాగే, హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ.. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. ఓ వైపు దాక్టర్ కోర్స్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో రాణిస్తుంది. తను ఇంకా పెద్దస్థాయికి వెళుతుంది. గొప్ప టెక్నీషియన్స్ ఐన సెంథిల్, పీటర్.. హీరో కిరీటి గురించి చెబుతున్నారంటే.. అంతకు మించిన సర్టిఫికేట్ ఇంకోటి ఉండదు.. జూలై 18న సినిమా రిలీజ్ కానుంది.. అందరూ తప్పకుండా చూడండి అంటూ’ రాజమౌళి తన స్పీచ్ ముగించారు.