అమెరికాలో పెద్ద డాక్టర్ అయ్యుండి.. ఇక్కడికొచ్చి సిన్మాలు తీస్తుంది: రానా దగ్గుబాటి

అమెరికాలో పెద్ద డాక్టర్ అయ్యుండి.. ఇక్కడికొచ్చి సిన్మాలు తీస్తుంది: రానా దగ్గుబాటి

మనోజ్ చంద్ర, మోనికా జంటగా ప్రవీణ పరుచూరి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న ఈ రూరల్ కామెడీ మూవీ శుక్రవారం (JULY18) ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌‌ ప్రెస్‌‌మీట్‌‌లో ప్రజెంటర్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘ఫస్ట్ టైమ్ ఈ సినిమా చూసినప్పుడు ఇందులోని పాత్రలన్నీ మనకి తెలిసిన, మన చుట్టూ ఉన్న క్యారెక్టర్సే అనిపించాయి. ఒక సినిమా తీయాలంటే అన్నీ వదిలేసుకు రావాలనే ఆలోచనకు భిన్నంగా ప్రవీణ అమెరికాలో కార్డియాలజిస్ట్‌‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఈ సినిమా తీశారు.

మనోజ్ జాబ్ చేస్తూ కూడా చాలా బాగా నటించాడు. నిర్మాతగా ఇలాంటి మంచి విజన్‌‌తో ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా. ఇక ఈ ఏడాది నేను ఏ సినిమా చేయకున్నా‘బాహుబలి’రీ రిలీజ్ రూపంలో నాకు బిగ్గెస్ట్‌‌ బ్లాక్ బస్టర్‌‌‌‌ రాబోతోంది. అలాగే అక్టోబర్‌‌‌‌లో ఓ ఫన్‌‌ అండ్ యూనిక్‌‌ ప్రాజెక్ట్‌‌ ఒకటి స్టార్ట్‌‌ చేయబోతున్నా’అని చెప్పాడు.

డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ ‘కేరాఫ్​కంచరపాలెం’చిత్రాన్ని చాలామంది థియేటర్స్‌‌లో చూడలేకపోయాం అన్నారు. కానీ ఈ సినిమాను మాత్రం అలా మిస్‌‌ అవ్వొద్దు. ఇందులోని పాత్రలన్నీ అద్భుతంగా తెరపైకొచ్చాయి. రానా గారితో కలిసి మరిన్ని చిత్రాలకు పనిచేయాలని కోరుకుంటున్నా’అని చెప్పారు. హీరో మనోజ్ చంద్ర, నటులు బెనర్జీ, రవీంద్ర విజయ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.