కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన SE చిన్నారెడ్డి కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఫిబ్రవరి 4న రాత్రి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండర్ విధించింది న్యాయస్థానం. ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ రిమాండ్ కొనసాగనంది.
ఓ కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన కూకట్పల్లి జోనల్ సూపరింటెండెంట్ ఇంజినీ ను ఏసీబీ ఆఫీసర్లు ఫిబ్రవరి 4న రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.... ఓ కాంట్రాక్టర్ కూకట్ పల్లి జోనల్ ఆఫీస్ పరిధిలో రూ.1.40 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాడు. వీటికి సం బంధించిన బిల్లులు మంజూరు చేయాలని జోనల్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పొద్దుటూరి చిన్నారెడ్డిని కలిశారు. దీంతో రూ.15 లక్షలు. ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని ఎస్ఈ స్పష్టం చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.
ALSO READ : మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
వారి సూచనతో బుధవారం జోనల్ ఆఫీస్ కి వెళ్లి ఎస్ఈ చిన్నారెడ్డితో పాటు అతడి వద్ద ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్న బాలసాని ప్రవీణ్ కుమార్ ను కలిసి రూ. 15 లక్షలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్ఈతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరినీ ఆరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ అడిషనల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు.
