మోడీ సర్కార్ రాహుల్‌‌‌‌ను సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది: సీఎం సిద్ధరామయ్య ఫైర్

మోడీ సర్కార్ రాహుల్‌‌‌‌ను సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది: సీఎం సిద్ధరామయ్య ఫైర్

బెంగళూరు: లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఈ తీరు భారత ప్రజాస్వామ్యానికి హాని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బుధవారం సిద్ధరామయ్య తన ‘ఎక్స్‌‌‌‌’ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణె రాసిన పుస్తకం నుంచి ఒక వ్యాసాన్ని పార్లమెంటులో రాహుల్ గాంధీ ఉటంకించేందుకు ప్రయత్నించారని చెప్పారు. 

2020 భారత–-చైనా సరిహద్దు వివాదం గురించిన ఆ విషయంపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదని, వెంటనే రాహుల్ మైక్ కట్ చేశారని తెలిపారు. ‘‘మోదీ ప్రభుత్వం రాహుల్‌‌‌‌ను సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. నరవణె పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ 2024లోనే విడుదల కావాలి. కానీ ప్రభుత్వం ఆ బుక్ రిలీజ్​ను అడ్డుకుంటున్నది’’ అని అన్నారు. అలాగే పుస్తకంలోని అంశాలను కోట్ చేస్తూ ప్రచురితమైన ఆర్టికల్​ను నరవణె తిరస్కరించలేదన్నారు. ఇప్పటికే పబ్లిష్ అయిన పుస్తకం ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉందని చెప్పారు.