హైదరాబాద్ లో రెండు ఫ్లోర్లలో రెండు రిజర్వాయర్లు

హైదరాబాద్ లో రెండు ఫ్లోర్లలో రెండు రిజర్వాయర్లు
  • నియోపోలీస్ నీటి సరఫరా ప్రాజెక్టులో భూమి ఆదా చేసే ఆలోచన
  • అధికారులతో చర్చించిన  వాటర్ బోర్డు ఎండీ

హైదరాబాద్ సిటీ, వెలుగు:  నియో పోలీస్​లో చేపట్టిన నీటి సరఫరా ప్రాజెక్టుతోపాటు గోదావరి 2, 3 దశలు, అమృత్ 2.0 ఎస్టీపీ ప్రాజెక్టు పనులను బుధవారం వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి విజిట్​చేశారు. మొదట ఖానాపూర్​లో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్​ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నియోపోలీస్ లో సమగ్ర మంచినీటి సరఫరా కోసం చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ సంబంధించిన  భూ కేటాయింపుపై హెచ్ఎండీఏ ఉన్నత అధికారులతో కలిసి చర్చించారు. 

నియోపోలీస్ లో భూమిరేటు అత్యధికంగా పలుకుతున్న నేపథ్యంలో రెండు రిజర్వాయర్లను రెండు ఫ్లోర్ల లా నిర్మిస్తే మిగిలిన ఖాళీ స్థలం భవిష్యత్​అవసరాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. జన్వాడలో బుల్కాపూర్ నాలా వద్ద నిర్మిస్తున్న 4 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను పరిశీలించారు. 

హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమీషనర్ (సబ్-అర్బన్) ఉపేంద్ర రెడ్డి, వాటర్ బోర్డు ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, జీఎంలు, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.