
హైదరాబాద్ పాతబస్తీలో బోనాల సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. కార్వన్ దర్బార్ మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. శుక్రవారం (జులై 18) మంత్రి వివేక్ తో పాటు కాలే యాదయ్య, స్పీగర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు.
దర్బార్ మైసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పోతరాజుల వేశాలతో ఆట పాటలతో బోనాల సంబరాలు మొదలయ్యాయి. మాజీ కార్పోరేటర్ మిత్ర కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్వాన్ మైసమ్స బోనాలకు హాజరైన మంత్రి వివేక్.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో పాటు వడిబియ్యాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
ALSO READ : మహిళ చనిపోతే ఆమె అప్పుల్లో రెండు లక్షలు మాఫీ: మంత్రి సీతక్క
పట్టువస్త్రాలు, వడిబియ్యం సమర్పించిన సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కుకున్నట్లు చెప్పారు. మంత్రి వివేక్ తోపాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్పీకర్ గడ్డం ప్రసాద్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: బోరబండ బోనాల ఉత్సవాల్లో మంత్రి
ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వివేక్.. ఆ తర్వాత బోరబండలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి యేటా అమ్మవార్లకు పట్టు వస్త్రాలతో పాటు పోతులను అందజేస్తున్న కార్పోరేటర్ బాబా ఫసియుద్ధీన్ ను అభినందించారు.. ఈ సందర్భంగా మంత్రి వివేక్ కామెంట్స్:
- బోరబండ ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు..
- లష్కర్ బోనాల పండుగ అంటే హైదరాబాద్ ప్రజలకు సంతోషమైన పండుగ..
- బోనాల పండుగ రోజు మా అమ్మ వారికి ప్రత్యేక వేడుకలు నిర్వహించేది
- రాష్ట్రంలో గత ప్రభుత్వం అప్పులను మిగిలించింది.
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు
- రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతోంది
- రాష్ట్రంలో ప్రజా పాలనలో జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి అందుతుంది..
- గతంలో జూబ్లీహిల్స్ ప్రజలకు మా తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో సేవ చేశారు.
- బోనాల పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి.
- అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి జరుపుకోవాలి.