మహిళ చనిపోతే ఆమె అప్పుల్లో రెండు లక్షలు మాఫీ: మంత్రి సీతక్క

మహిళ చనిపోతే ఆమె అప్పుల్లో రెండు లక్షలు మాఫీ: మంత్రి సీతక్క

రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరినీ  కోటీశ్వరులను చేయాలని సీఎం రేవంత్ సంకల్పంతో ఉన్నారని అన్నారు మంత్రి సీతక్క. అందులో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘం లో వుండటం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకు ల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మహిళ చనిపోతే ఆమె పేరున ఉన్న అప్పుల్లో రూ. 2 లక్షలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 

మహిళా సంఘం అంటేనే వ్యాపారం చేయాలని.. మహిళా సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క.   60 ఏళ్లు దాటినా కూడా మహిళా సంఘం లో చేర్పిస్తున్నామని అన్నారు. రూ.300 కోట్లు వెచ్చించి మహిళలు తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడం కోసం హైదరాబాద్ లో షాప్ లు తెరిపించినట్లు చెప్పారు.  గోదాంలు , మిల్లులు,పెట్రోల్ బంక్ లు, కోళ్ల ఫామ్ లు ఇంకా చాలా మహిళా సంఘాలకు ఇస్తున్నామని అన్నారు. ఇందిర మహిళా శక్తి వంట..  అమ్మ చేతి వంట అని అన్నారు.

Also Read:-నాకు తమ్ముడి లాంటివాడు.. లోకేష్ను కలిస్తే తప్పేంటి.?

ఆడవాళ్లు లేకుంటే సమాజం లేదని.. ఆడవాళ్ల లో ఉక్కు మహిళా ఇందిరమ్మ అని అన్నారు.  ఒక మహిళ అయినటువంటి  ఇందిరమ్మ అప్పుడే  పాకిస్థాన్ ను గజ గజ వణికించిందని కొనియాడారు. పేదరికం వుండొద్దు అంటే మహిళల చేతిలో డబ్బులు ఉండాలని అన్నారు మంత్రి సీతక్క.  ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటికి మహిళను ఓనర్ ను చేస్తున్నామని అన్నారు.