- ప్రారంభించిన సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాగిత రహిత (పేపర్ లెస్) పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అన్నారు. ఈ- ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్లకు సత్వర పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ‘ఈ- ఆఫీస్’ అప్లికేషన్,‘ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడారు.. ఈ ఆఫీస్ అప్లికేషన్ వల్ల సిబ్బంది హాజరులో క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. క్రిమినల్ చట్టాల చట్టాల అమలుకు సర్క్యులర్లు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల రూపకల్పనలో ప్రాసిక్యూటర్లు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
