Tax News: ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ ఫైలింగ్ కోసం ఫారం-2 విడుదలైంది చూస్కోండి..

Tax News: ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ ఫైలింగ్ కోసం ఫారం-2 విడుదలైంది చూస్కోండి..

Income Tax News: చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే తమ ఐటీఆర్ ఫైలింగ్ కోసం ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను అధికారులు కూడా వీటికి అవసరమైన ఫైలింగ్ ఫారంలను వరుసగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగులు టాక్స్ ఫైలింగ్ కోసం ఉపయోగించే ఐటీఆర్ ఫారం-2ను తమ అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా ముందుగా నింపిన డేటాను ఉపయోగించి పన్ను చెల్లింపుదారులు తమ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ దాఖలును పూర్తి చేయవచ్చు. దీనిని ఉద్యోగులు లేదా వ్యాపారం నుంచి లాభాలను అందుకునే వ్యక్తులు, ఇతర వనరుల నుంచి ఆదాయం పొందే వ్యక్తులు, HUFల కోసం ఉద్దేశించబడింది. 

జీతం, పెన్షన్, ఇంటి అద్దె ఆదాయం సహా ఇతర వనరుల నుంచి ఆదాయం వచ్చే వ్యక్తులు ఫారం 2 పూరించటం ద్వారా తమ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. దీనికి ముందు పన్ను శాఖ జూలై 11న ఐటీఆర్-2,3 కోసం ఎక్సెల్ ఆధారిత యుటిలిటీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

Also Read:-నష్టాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. అసలు కారణాలు ఇవే..

2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూలై 31 నుంచి గడువును.. సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. గడువులో పొడిగింపు వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, వారి ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని సంస్థలకు వర్తిస్తుంది.