గుండుతోనే పెళ్లి చేసుకున్న వధువు!.. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. అసలు నిజం ఇదీ!

గుండుతోనే పెళ్లి చేసుకున్న వధువు!.. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. అసలు నిజం ఇదీ!

ప్రతి ఒక్కరి జీవితంలో  పెళ్లంటే ఓ కల.. మధుర జ్ఞాపకం. దీని కోసం  చాలా మంది  మహిళలు  అందంగా రెడీ అవుతారు.  పట్టుచీర, ఒంటి నిండా  బంగారు ఆభరణాలు, మొహానికి మేకప్..తలకు పొడవాటి విగ్గు, పూలు పెట్టుకుని అందంగా  సింగారించుకుని పెళ్లిమండపంలోకి  అడుగుపెడతారు. అందరి దృష్టి ఆకర్షిస్తారు. కానీ  మహిమా ఘాయ్ అనే ఓ భారతీయ వధువు పూర్తిగా గుండు చేయించుకుని పెళ్లి మండపంలోకి అడుగు పెట్టి అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. పెళ్లికి  స్టైల్ గా ..వధువు మహిమా ఘాయ్  ఎర్రటి లెహంగా ధరించి.. చిరునవ్వుతో  ఆమె తనకు  కాబోయే భర్తతో ఫోట్ షూట్ లో పాల్గొన్న  వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే తర్వాత  అసలు నిజం తెలిసి  వధువును అందరు ప్రశంసలతో ముంచెత్తారు. 

వధువు మహిమా ఘాయ్ గుండుతో పెళ్లి వేడుకలోకి అడుగు పెట్టడానికి కారణాలు లేకపోలేదు. మహిమా ఘాయ్  అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతోంది. దీని వల్ల ఆమె జుట్టును కోల్పోయింది. దీంతో పెళ్లి వేడుకకు విగ్గు పెట్టుకోకుండా..పూర్తిగా గుండుతోనే రావాలని ఆమె నిర్ణయించుకుంది.  

మహిమా  తన ఇన్ స్టాల్ ఇలా పోస్ట్ చేసింది.   నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోకముందే అలాఫేసియాతో నా జుట్టు ఊడిపోయింది. నొప్పి, రకరకాల చికిత్సలు, మానసిక వేధన, ఎన్నో రోజులుగా నన్ను వేధించింది. నన్ను నేను  దాచుకోవడం.. నాకు నేను క్షమాపణ చెప్పుకోవడం మానేశా. అందుకే నేను  గుండు చేయించుకున్నా.  నేను వధువుగా గుండుతో వచ్చా. నాకు నేను ధైర్యం చెప్పుకున్నా..ఎందుకంటే..? జుట్టు ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడూ అసంపూర్ణం కాదు అని పోస్ట్ చేసింది. 

అలోపేసియాతో బాధపడుతోన్న  మహిమా ఘాయ్    ధైర్యంగా గుండుతో పెళ్లి వేడుకలో కనిపించాలనే నిర్ణయానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆమె ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అలోపేసియా బారిన పడుతున్న.. జుట్టు రాలిపోయి ఒత్తిడికి గురవుతున్న ఎంతో మందికి స్పూర్తి అని కొనియాడుతున్నారు.