హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. హోలీ సేల్‌ను మొదలుపెట్టింది. రూఫస్, లెన్స్ ఏఐ వంటి ఫీచర్ల ద్వారా కస్టమర్లు తమకు కావాల్సిన హోలీ వస్తువులను సులభంగా ఎంచుకోవచ్చు. హోలీ వేడుకల కోసం సేంద్రియ రంగులు, దుస్తులు, గృహ అలంకరణ వస్తువులు, స్వీట్లు ప్లాట్‌ఫామ్‌పై లభిస్తున్నాయి.
ఆర్గానిక్ గులాల్ ప్యాక్ రూ.125 నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల ఎనిమిది వరకు అమెజాన్ పే యూపీఐ ద్వారా షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. వాషింగ్ మెషీన్లు, ఏసీలపై 65 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
