బంగ్లాదేశ్ లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బంగ్లాదేశ్ లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బంగ్లాదేశ్ లో మరోసారి హిందువులపై దాడి  కలకలం రేపుతోంది.. ఓ హిందూ వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. బజారుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది. తీవ్రంగా కొట్టి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పింటించారు దుండగులు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక మీడియా ప్రకారం..52 ఏళ్ల ఖోకోన్ దాస్ అనే వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి  తీవ్రంగా కొట్టారు. అనంతరం అతనిపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ దాడితో స్థానిక హక్కుల సంఘాలఆగ్రహం వ్యక్తం చేశాయి. 

వరుస దాడులు.. 

గడిచిన 15 రోజుల్లో ఇది నాలుగో దాడి. అంతకుముందు డిసెంబర్ 18న దీపూచంద్రదాస్ కొట్టి చంపాయి  అల్లరిమూకలు.. అనంతరం నడిరోడ్డుపై చెట్టుకు వేలాడదీసి నిప్పింటించాయి. డిసెంబర్ 24న కలిమోహర్ ప్రాంతంలో 29 ఏళ్ల అమృతమండల్ అనే వ్యక్తిని అల్లరిమూకలు కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.  మైమెన్‌సింగ్‌లోని భలుకాలోని ఒక వస్త్ర కర్మాగారంలో జరిగిన మరో సంఘటనలో, ఒక హిందూ యువకుడిని అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపారు. 

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా భారత్ లో అనేక నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులను రాజకీయ పార్టీలు, నేతలు తీవ్రంగా ఖండించారు. దాడులపై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. 

బంగ్లాదేశ్ లో అశాంతి..

డిసెంబర్ 18న విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది మృతి  తర్వాత బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టాక .. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. హాదీ హత్యతో భారత్, బంగ్లాదేశ్ లో మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీసింది.  హాదీ మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని భారత్ పిలుపునిచ్చింది. ఆ దేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.