భారత్ శక్తివంతమైన దేశం..: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై నెతన్యాహు ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి!

భారత్  శక్తివంతమైన దేశం..: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై నెతన్యాహు ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. అమెరికన్ యూదు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే వారం మన దేశానికి ఎవరు వస్తున్నారో తెలుసా ? నరేంద్ర మోదీ వస్తున్నారు" అని ఉత్సాహంగా చెప్పారు.

భారత్ పై ప్రశంసలు:
భారత్, ఇజ్రాయెల్ మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. మేము అన్ని రంగాల్లో సహకారం గురించి చర్చించబోతున్నాం. భారతదేశం చిన్న దేశం కాదు, 140 కోట్ల జనాభా ఉన్న దేశం. భారతదేశం ఎంతో శక్తివంతమైనది, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న దేశం అని నెతన్యాహు అన్నారు. 

ఈ పర్యటన ఎందుకు ప్రత్యేకం:

ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ సందర్శించారు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు పర్యటిస్తున్నారు.  మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

 ఇజ్రాయెల్‌ టూర్ ఎందుకు:
 రక్షణ రంగం, సైబర్ భద్రత, వ్యవసాయం, ఉగ్రవాద నిర్మూలనపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం పై సంతకాలు జరిగాయి. రెండు దేశాలు కలిసి కొత్త రకమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసుకునేలా గతంలోనే కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పర్యటనతో ఆ బంధం మరింత బలపడనుంది.