- కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పార్టీలకతీతంగా కార్పొరేటర్లందరినీ కలుపుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తానని మేయర్‌గా ఎన్నికైన మూడ్ గణేశ్ పేర్కొన్నారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.
డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత మాట్లాడుతూ అందరిని సమన్వయం చేసుకుంటూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రోగ్రాంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు. ఎన్నికైన మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను, కార్పొరేటర్లను సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డి, సాబీర్ పాషా, భాగం హేమంతరావు
అభినందించారు.
