ఖమ్మం టౌన్,వెలుగు : విద్యార్థులను వారి తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి,రేడియేషన్ భారిన పడకుండా వారికి ఆటపాటలతో కూడిన విద్య విధానాన్ని అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి(ఐఎఫ్ఎస్) సిద్ధార్థు విక్రమ్ సింగ్ సూచించారు. సోమవారం ఖమ్మం నగరంలో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో హార్వెస్ట్ టెండర్ రూట్స్ స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రవి మారుత్,ప్రిన్సిపాల్ ఆర్.పార్వతి రెడ్డి,టెండర్ రూట్స్ హెచ్ఎం ఆసీమా, అకడమిక్ ఇంచార్జ్ ఉషశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈసందర్భంగా అటవీశాఖ అధికారి మాట్లాడుతూ,విద్యతో పాటు క్రమశిక్షణ, బాధ్యత,సేవాభావం వంటి విలువలు విద్యార్థి జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాయన్నారు. తర్వాత కరస్పాండెంట్ రవి మారుత్ మాట్లాడుతూ, చదువు అంటే పుస్తకాలు,అక్షరాలు మాత్రమే కాదన్నారు. క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.ప్రిన్సిపాల్ పార్వతీ రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యాసంస్థల లో చదువుతో పాటు శస్త్ర, సాంకేతిక,రంగాలకు సంబంధించి విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించడంలో ఎప్పుడు ముందుటామని స్పష్టం చేశారు.
