భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మున్సిపాలిటీలో భార్యా భర్తలు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికల టైంలోనే చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పేర్లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ తరుపున ఆరో వార్డు నుంచి జూపల్లి శశికళ, 13 వార్డు నుంచి జూపల్లి రమేష్ పోటీ చేసి విజయం సాధించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో సోమవారం కౌన్సిలర్ల చే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్తీక్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నియమించారు.
కాంగ్రెస్లోకి స్వతంత్ర్య అభ్యర్థులు: ఇల్లెందు మున్సిపల్ స్వతంత్ర కౌన్సిలర్లు షేక్ సైదుమియా, కొర్లపాటి శివ కిరణ్ సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
సత్తుపల్లిలో మీడియాపై ఆంక్షలు
సత్తుపల్లి : సత్తుపల్లిలో నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ లు ధర్నా చేశారు. విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ కోసం వెళ్ళిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పై ఆంక్షలు విధిస్తు, అనుమతి లేదనటంతో కార్యాలయం ఎదుటే ధర్నా చేశారు. జిల్లాలో ఏ మున్సిపాలిటీలోనూ లేని వివక్ష సత్తుపల్లి మున్సిపాలిటీలోని జర్నలిస్టుల పట్ల చూపుతున్నారని జర్నలిస్టు ఆరోపించారు.
