టాలీవుడ్ నుంచి ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో ‘నాగ బంధం’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్లో విజువల్స్ ప్రేక్షకులు ఆశించిన విధంగా ఉండటంతో సినిమా విడుదలైన తొలి రోజు బుకింగ్స్ కాస్తంత చెప్పుకోతగ్గట్టుగానే ఉన్నాయి. అయితే.. ‘నాగ బంధం’ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
కొంతమంది విజువల్స్ బాగున్నాయని ప్రశంసిస్తే.. మరికొందరు సినిమా కథ, కథనం ఆసక్తి రేకెత్తించడంలో విఫలమైనట్టుగా చెప్పుకొచ్చారు. సినిమా నిడివిపై కూడా ప్రేక్షకులు పెదవి విరిచారు. నిడివిపై విమర్శలు రావడంతో.. ఇంతకు ముందు ఉన్న 3 గంటల 5 నిమిషాల సినిమా నిడివిని చిత్ర బృందం 2 గంటల 45 నిమిషాలకు తగ్గించేసింది. సినిమాలో పనికి రావని భావించిన సన్నివేశాలు ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా తొలగించారు.
ALSO READ : Maa Inti Bangaram OTT: ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
20 నిమిషాల రన్ టైం తగ్గడం ‘నాగ బంధం’ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ వీకెండ్ ‘నాగ బంధం’తో పాటు ‘రావు బహదూర్’ సినిమా మాత్రమే తెలుగులో కాస్త పెద్ద సినిమా కావడంతో.. మైథలాజికల్ సినిమా అయిన తమ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడతారని ‘నాగ బంధం’ మూవీ టీం బలంగా నమ్ముతోంది. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ‘నాగ బంధం’ సినిమా జులై 3న విడుదలైంది.
