లేడీ సూపర్ స్టార్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. జూన్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ లోపు తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఒక వైపు కుటుంబ మనోభావాలు మరియు మరోవైపు థ్రిల్లింగ్ అడ్వెంచర్ సీన్స్ సినిమాను బాక్సాఫీస్ బరిలో సత్తా చాటేలా చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సమంత చూపించిన యాక్షన్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమె స్నేహితురాలి పాత్రతో పాటు శ్రీముఖి, గుల్షన్ దేవయ్యల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇపుడు ఈ సూపర్ హిట్ ఫిల్మ్ ఓటీటీ స్ట్రీమింగ్పై క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#MaaIntiBangaaram grosses 92 CRORES WORLDWIDE 🔥
— Tralala Moving Pictures (@TralalaPictures) July 3, 2026
Going super strong at the box office with terrific bookings in the 3rd weeknd ❤🔥
Enjoy the BIGGEST EVER FEMALE-LED TELUGU FILM in theatres ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss@TralalaPictures… pic.twitter.com/GjH3184g3R
‘మా ఇంటి బంగారం’ OTT:
‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత కేవలం 4 నుండి 6 వారాల వరకు OTT లో ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. అంటే, ఈ మూవీ జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో అందుబాటులో ఉంటుందని సినీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, సమంత భర్త, చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరు పుట్టినరోజు ఆగస్టు 4న ఉండటంతో, ఆ సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురావచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఓటీటీ విడుదల తేదీపై ఇప్పటివరకు చిత్ర బృందం లేదా జియోహాట్‌స్టార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
