ఈ-రిక్షాలను రిమోట్‌తో ఆపేస్తున్న యాప్‌లు.. గూగుల్, యాపిల్‌కు కేంద్రం నోటీసులు 

ఈ-రిక్షాలను రిమోట్‌తో ఆపేస్తున్న యాప్‌లు.. గూగుల్, యాపిల్‌కు కేంద్రం నోటీసులు 
  • గూగుల్, యాపిల్  కు కేంద్రం నోటీసులు 
  • 7 వివాదాస్పద యాప్ లను తొలగించాలని ఆదేశం 
  • ప్లే స్టోర్లనుంచి ఈ యాప్ లను వెంటనే తొలగించాలని నోటీసులు 
  • బ్లాక్ లిస్టులో BAT-BMS, SMARTS SMS  యాప్ లు 

గూగుల్, యాపిల్ సెల్ ఫోన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 7  వివాదాస్పద యాప్ లను తొలగించాలని ఆదేశించింది. గూగుల్, యాపిల్  ఫోన్లలో ప్లేస్టోర్లలో  ఈ యాప్ లను వెంటనే తొలగించాలని నోటీసులో తెలిపింది. BAT-BMS, SMARTS SMS  యాప్ లనుగుర్తించిన ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. 

ఢిల్లీలో ఈ ఆటో రిక్షాలకు మంచి క్రేజ్ ఉంది.. ఇవి ఈ బ్యాటరీ ద్వారా నడుస్తాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ బ్యాటరీలను సెల్ ఫోన్లలో యాప్ ల ద్వారా నియంత్రిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . ఈ రిక్షాల్లోని బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి వాటిని నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ వాహనాలు రన్నింగ్ ఉండగానే ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు కంప్లైంట్స్ అందడంతో కేంద్ర  ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఈ చర్యలకు దిగింది. 

►ALSO READ | AI ని ఇలా కూడా వాడొచ్చా.. చెత్త ఎత్తకుండానే కాలనీలు క్లీన్ అండ్ గ్రీన్.. ఏం ట్యాలెంటబ్బా మీది !

గూగుల్, యాపిల్ ఫోన్లలో ప్లేస్టోర్లలో ఉన్న ఏడు యాప్ ల ద్వారా దుంగడులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆ యాప్ లను వెంటనే తొలగించాలని గూగుల్, యాపిల్ కంపెనీలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆదేశించింది.ప్రభుత్వం గుర్తించిన యాప్‌లలో BAT-BMS, Lossigy, Epoch-i-ion వంటి యాప్‌లు ఉన్నాయి. 

ప్రభుత్వం ఈ యాప్‌లను ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద కాకుండా, ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం తొలగించాలని కోరుతోంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే, గూగుల్, యాపిల్‌కు ఉన్న చట్టపరమైన రక్షణలు (Safe Harbour) కోల్పోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అధికారులునిర్వహించిన ఓ టెస్టులో బ్లూటూత్ ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు యాప్‌ను కనెక్ట్ చేసి, ఈ-రిక్షాను రిమోట్‌తో నిలిపివేయడం సాధ్యమైందని వెల్లడైంది. సాధారణంగా ఈ యాప్‌లు బ్యాటరీ లైఫ్ పరిశీలించేందుకు రూపొందించారు. భద్రతా లోపాల వల్ల వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.