జులై 5 నుంచి బాసరలో అక్షరాభ్యాసం, సర్వదర్శన సేవలు.. బాల ఆలయానికి ఏర్పాట్లు పూర్తి

జులై 5 నుంచి బాసరలో అక్షరాభ్యాసం, సర్వదర్శన సేవలు.. బాల ఆలయానికి ఏర్పాట్లు పూర్తి

ఈ నెల (జులై) 5వ తేదీ నుంచి నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో భక్తులకు అక్షరాభ్యాసం, సర్వదర్శన సేవలు కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అందుకోసం బాల ఆలయానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం (జులై 03) చెప్పారు. 

జులై 5 నుంచి  అమ్మవారి గర్భ గుడిలోకి భక్తులకు అనుమతి ఉండదు. శృంగేరి పీఠాదిపతి సూచనల మేరకు అమ్మవారి మూల విరాట్టుకు గర్భగుడిలో యధావిధిగా పూజలు సాగనున్నాయి.  దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని బాసర అమ్మవారి ఆలయ ఈవో అంజన దేవి విజ్ఞప్తి చేశారు. 

బాల ఆలయానికి ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈవో అంజనీ దేవి. ఈ కార్యక్రమంలో  ఏఈవో శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ పాల్గొన్నారు. 

►ALSO READ | అయోధ్య రామాలయంలో దొంగతనం దురదృష్టకరం.. ఖండిస్తున్నాం : RSS ప్రకటన