తెలంగాణ అప్పులపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. అన్నట్లుగానే శుక్రవారం (జులై 03) ప్రెస్ క్లబ్ కు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరిన ఆయన.. ప్రెస్ క్లబ్ కు చేరుకుని.. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తారని మూడు కుర్చీలు వేశాను. కానీ వాళ్లకు ముఖం చెల్లలేదు. అందుకే చర్చకు రాలేదు. మరి ఇప్పుడు పారిపోయింది ఎవరు..? అంటూ ప్రశ్నించారు.
మంత్రి జూపల్లి పూర్తి కామెంట్స్:
- ఎవరు పారి పోయింది సిగ్గు, శరమ్ ఉండాలి
- పాలమూరి పౌరుషం బరాబర్ ఉంది
- సిగ్గు తప్పిన బతుకు మీరు బతుకుతున్నారు.
- వాస్తవాలు పక్కన బెట్టి కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
- మంత్రి పదవికి రాజీనామాకు కట్టుబడి ఉన్నాను
- మీరు ఎందుకు కట్టుబడి లేరు
- కేసీఆర్ తో చెప్పించండి నా లెక్కలు తప్పు అని
- ఉల్టా చోరు కొత్వాల్ కో డాట అన్నట్టు హరీష్ వైఖరి
- నేను చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క తప్పైన రాజీనామా చేస్తా..
- మాయమాటలు మోస పోవద్దు
- సోషల్ మీడియా ప్రచారం చూసి నిజం అని నమ్మొదు
- నిజం చెప్పేందుకు పౌరుషం ధైర్యం ఉండాలి
- మీ మాట నిజం అయితే రాజీనామా చేస్తాం అని ఎందుకు చెప్పడం లేదు
- ప్రెస్ క్లబ్ కు వస్తానని ఉదయం 11 గంటలకే కేటీఆర్, కేసీర్, హరీష్ కు లేఖ రాసిన
- వాళ్ల కోసం మూడు కుర్చీలు వేసిన
- మా ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని నేను మాట్లాడలే
- మీ హయాంలో ఎంత అనేది మాట్లాడా
- కేటీఆర్ 3.5 లక్షల కోట్లు అంటున్నారు
- హరీష్ 4.17 లక్షల కోట్లు అంటున్నారు
- మీరు చెప్పేది తప్పు అని నేను చెప్పిన
- బీఆర్ఎస్ చేసిన అప్పులు, బకాయిలు 8.21 లక్షల కోట్లుఅని నేను లేఖలో పేర్కొన్న
- 4 పేజీల్లో పూర్తి వివరాలు పేర్కొన్న
- అప్పుల చిట్టాను వాట్సాప్ లో పంపించా
- నేను పేర్కొన్న లెక్కలు తప్పు అయితే రిజైన్ చేస్తానని పేర్కొన్న.
- నా లెక్కలు కరెక్టు కాబట్టే లేఖలో రాశా.. మాట మీద నిలబడ్డాను
- అప్పు రూ.8 లక్షల కోట్లు అని కేంద్రమే చెప్పింది.
- ప్రెస్ క్లబ్ కు రావాలని ఆహ్వానించిన
- ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న
- అడిగిన దానికి సమాధానం చెప్పకుండా.. సొల్లు పురాణం చెప్తున్నారు
- బీఆర్ఎస్ నేతలు పూర్తిగా ఫెయిల్ అయ్యారు
- కాళేశ్వరం కార్పోరేషన్ అప్పుల గురించి ఎందుకు చెప్పడం లేదు
- మిషన్ భగీరతపై 40 వేల కోట్ల అప్పు.. ఎవరు చెల్లించాలి..
- కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పులను బీఆర్ఎస్ చెప్పడం లేదు
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2 లక్షల 8 వేల 681 కోట్ల వడ్డీ కట్టింది ..
- మేము చేసిన అప్పుకే ఇంత వడ్డీ కట్టామా..?
- బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టే.. మంత్రి పదవికి రాజీనామా చేశా
- పారిపోవడం మా ఇంటా వంటా లేదు
- నేను మాట్లాడిన లెక్కలు తప్పు అని మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడించాలని డిమాండ్ చేస్తున్నా
- చర్చకు మీరు రాక, నేను పారిపోయానని అంటారా..?
